SSC Results | పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయం.. ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థిని
SSC Results | పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది.
SSC Results | పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు హాజరైంది. అయితే పరీక్షలు అయిపోయినప్పటి నుంచి ఫెయిల్ అవుతానేమో అని సాయిప్రియకు భయం పట్టుకుంది. దీంతో పరీక్షల అనంతరం దిగులుగా ఉండేది. ఇది గమనించి తల్లి ఆమెకు ధైర్యం చెప్పింది. ఫెయిల్ అయిన ఫర్వాలేదని చెప్పింది. అయినప్పటికీ సాయిప్రియ టెన్షన్ పడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే శుక్రవారం కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. ఇది గమనించిన సాయిప్రియ సోదరుడు తల్లికి చెప్పాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- medak
- SSC Exams
- SSC results
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

