హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పేపర్ లీకేజీలో ప్రమేయమున్న మరో 16 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ శాశ్వతంగా డిబార్ చేసింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
భానూరి ప్రదీప్‌కుమార్, అదావత్ నరేశ్, నీలం రవితేజ, పసుపులేటి శ్రీనివాస్, గుగులోతు పాపారావునాయక్, మడికి కాంతారావు, జనిపల్లి శ్రీనివాస్, జనిపల్లి రవికుమార్, గుల్ల కుమార్, గురుకు శ్యాంప్రసాద్, కల్లూరి ప్రశాంత్, మలోత్ బుజ్జిబాబు, గుగులోతు రమానాయక్, భరత్‌కుమార్, కే సత్యనారాయణరెడ్డి, బానోతు మక్కట్లాల్పై శాశ్వత డిబార్ వేటు వేశారు. వీరు ఇది వరకు హాజరైన పరీక్షలు కూడా చెల్లుబాటు కావని వెల్లడించారు. గ్రూప్-1 సహా ఇతర పరీక్ష పేపర్ లీకేజీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ఈ కేసుల్లో గతంలో కొందరిని డిబార్ చేయగా, తాజాగా మరో 16 మందిపై అదే వేటు పడింది.