హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పదేండ్ల కాలంలో కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఎప్పుడు కూడా ‘తమరు’ అనే సంబోధించేవారని, ఆయన కొడుకులకు మంచి పదవులిచ్చి ప్రోత్సహించారని ఇంత చేసినా ఆయన పార్టీ మారడమంటే నయవంచనే, పచ్చి అవకాశవాదం అవుతుందని బీఆర్ఎస్ నాయకుడు శ్రీశైల్‌రెడ్డి పంజుగుల మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని తప్పుబట్టారు.
ఆయన తీరును తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీఆర్ఎస్ ద్వారా అధికారాలు, పదవులు అనుభవించి చివరి నిమిషంలో పార్టీని వదిలివెళ్లిన వారిని ప్రజలు చిత్తుగా ఓడించారని, అందుకు పట్నం సునీతామహేందర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి నిదర్శనమని, దానం నాగేందర్‌ను కూడా ఎంపీ ఎన్నికల్లో ఓడించారని గుర్తుచేశారు.