సిద్దిపేట : తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీనివాస్ వెంట టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల