PhD Award | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో శ్రీనివాస్ కత్తెరసాల డాక్టరేట్ సాధించారు. డాక్టర్ రామ్ షెఫర్డ్ పర్యవేక్షణలో ‘నాలెడ్జ్ అండ్ ప్లాన్స్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్: ఎ కంపారేటివ్ స్టడీ ఆఫ్ కన్జర్వేటివ్ అండ్ ఇంటెన్సివ్ ఫార్మర్స్ ఆఫ్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్ వ్యవసాయ రంగంలో ఆధునిక పోకడలు, రసాయనిక ఎరువులు, మందులు వాడడం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ప్రకృతి ఏ విధంగా నష్టపోతుందో తన పరిశోధనలో వివరించారు. తన పరిశోధనను పూర్తి చేసే క్రమంలో ఆయన రూపొందించిన తొమ్మిది పరిశోధన పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.