మహబూబ్నగర్ : రాష్ట్రంలో సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదు. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తూ బీఆర్ఎస్ నాయకులును వేధిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అధికారులు పని చేయాల్సి ఉంటుంది కానీ,
పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం నడిపిస్తుందని ఆరోపించారు. పోలీసు శాఖ వ్యవహారం చూస్తే సిగ్గు అనిపిస్తుంద్నారు. ఎన్నికల రూల్స్ అందరికి ఒకేలా ఉండాలి. కానీ బీఆర్ఎస్ అభ్యర్థులకే రూల్స్ వర్తిస్తున్నాయని తెలిపారు. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే అరాచకాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి పోలీసులే సహకరిస్తున్నారని ఆరోపించాఉ. ఎన్నికలే లేకుండా పోలీసులు అందరినీ విత్ డ్రా చేయిస్తే అయిపోయేదిగా! అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల అధికారులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదన్నట్టు ఉంటున్నారు. అందరూ అభ్యర్థులను సమానంగా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి అందరూ ఏకమయ్యారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ నడవవని ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై అధికారుల పర్యవేక్షణ లేదు, చర్యలు లేవు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను వేధిస్తే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు.