మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 22 : గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు.
రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని, గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.