హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress government) మానవత్వం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను కూల్చివేసిన(Demolition house) ఘటనపై ఆయన స్పందించారు. దివ్యాంగులు అని చూడకుండా వారి ఇండ్లను కూల్చడమంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదని తెలిసిపోయిందన్నారు.దివ్యాంగులు నివసిస్తున్న కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకి లాగేసి ఇళ్లను కూల్చడం బాధాకరం.
నిన్న జరిగిన సంఘటనను మీడియా సరిగ్గా చూపిస్తే దివ్యాంగుల పట్ల భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని మన దేశానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. అలాగే సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు శ్రీనివాస్ గౌడ్ అల్ఫాహారం అందజేశారు. బాధితుల పక్షాన పోరాడుతామని హామీనిచ్చారు. కాగా, హైదరా బాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.
ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే.