హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం తనిఖీ చేశారు. నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గౌడ వృత్తి దారుల గౌరవం పెంచేలా సీఎం కేసీఆర్ ఆదేశాలతో నీరా కేఫ్‌ను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. మంత్రి వెంట టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులున్నారు.