మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 6 : మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నీకు కల్లు పైసలు ముట్టలేదని.. బీజేపీలోకి పోను అని ఎల్లమ్మ ఆలయం వద్దకు వచ్చి చెప్పు.. గౌడ్ల కష్టంతో నీ బండ్లు నడుస్తున్నాయి.. నీ క్యాంప్ ఆఫీస్ నడుస్తున్నది.. లెక్కలతో సహా బయట పెడతా’? అని స్థానిక ఎమ్మెల్యేపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేయమంటే అహంకారంతో మాట్లాడుతున్నావు.. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే.. పొరపాట్లు ఉంటే సరి చేస్తామని చెప్పాల్సిన ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు’ అని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.