హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రెండేండ్లలో ఒక లైఫ్ సైన్సెస్ రంగంలో 63వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. భవిష్యత్తులో విద్యుత్తు కొరత లేకుండా కొత్త గ్రీన్ ఎనర్జీ పాలసీ రూపొందించినట్టు వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని 13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా రూపొందించనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా మహిళలు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రూపు చర్చలో పొన్నం మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటుచేసిన స్టాళ్లలో తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు కనుమరుగయ్యాయి. తెలంగాణలో ప్రసిద్ధ ఆలయాలైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలు టెంపుల్ టూరిజం స్టాల్లో కనిపించలేదు. యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ హయాంలో పునర్నిర్మాణం చేయడం వల్లనే టెంపుల్ టూరిజంలో చేర్చలేదనే విమర్శలొస్తున్నాయి. తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం, పోలీసు శాఖకు తలమానికంగా ఉన్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఫొటోలు కూడా కనిపించలేదు.