దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర నుంచి పన్నుల రూపం లో కేంద్రానికి రూ. 26వేల కోట్లు సమకూరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం శోచనీయం.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పలుసార్లు ప్రధానిసహా కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టానికి సహాయం కోసం విన్నవించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.