భద్రాచలం | ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా భద్రాచల రామాలయంలో శ్రీరామచంద్రస్వామి రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. మంగళవారం నిజ రూపమైన శ్రీరామావతారంలో స్వామివారు పూజలు అందుకున్నారు. శ్రీరామావతారంలో ఉన్న దేవదేవుడు మాడవీధుల్లో ఊరేగి మిథిలా ప్రాంగణానికి విచ్చేశారు.
స్వామి వారి ఊరేగింపు సందర్భంగా రామనామ స్మరణలతో, కోలాటాల హంగామాతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఇవాళ బలరామావతారంలో స్వామివారి దర్శనం ఉంటుందని ఈఓ రమాదేవి తెలిపారు.