హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ 2024 ఫలితా ల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు డైరెక్టర్ సుష్మ తెలిపారు. 720/720 మార్కులతో ఓపెన్ క్యాటగిరీలో 9 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి శ్రీచైతన్య అధిపత్యాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో 1వ ర్యాంకు వీ కళ్యాణ్, పీ పవన్ కుమార్ రెడ్డి, ముఖేశ్ చౌదరీ, భానుతేజసాయి, ఇరాన్ ఖ్వాజీ, దర్శ్ పగ్దార్, ఇషా కొఠారీ, ఆదర్శ్ సింగ్ మోయల్, అమీనా ఆరిఫ్ వరుసగా 9 తొలి ర్యాంకులు సాధించారని తెలిపారు. 715 మార్కులతో 30 మంది, 710 మార్కు ల పైన మరో 57మంది, 700 మార్కులపైన 132 మంది, 650 మార్కులపైన 852 మంది శ్రీచైతన్య విద్యార్థులు సత్తా చాటారని వివరించారు. ఈ అద్భుత విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సుష్మ అభినందనలు తెలిపారు.