హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావును సిట్ అధికారులు ఐదుగంటలపాటు విచారించారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషనలో ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటికే శ్రవణ్‌రావును సిట్ అధికారులు మూడుసార్లు విచారించారు. ఈ కేసులో సిట్ శ్రవణ్‌రావును మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది.