ఎంపీల ‘మర్యాద’కు 2% ఇవ్వండి!
వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రోపణలొచ్చాయి.
- వ్యవసాయ వర్సిటీలో వసూళ్లపర్వం
- యూజీసీ ఎరియర్స్ విడుదల కోసం అక్రమాలకు తెరలేపిన ఓ కీలక అధికారి
- వసూళ్లకు ఓ అనధికారక బృందం ఏర్పాటు
- ఎరియర్స్ విడుదలైన ప్రొఫెసర్లకు ఫోన్లు
- ఎంపీ ఈటల, విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లు రవికి చేసే సన్మానం ఖర్చులేనంటూ డిమాండ్
- ఇటీవలే 35 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- మొత్తంగా 70 లక్షల వసూలుకు బిగ్ ప్లాన్
- కొంత ఖర్చుచేసి మిగతాది నొక్కేలా కుట్ర
ఇది మరో తరహా అవినీతి తంతు. ఎంతోకొంత నొక్కేయాలన్న గొంతెమ్మ కోరిక. దానికి సన్మానం అనే రంగుపూసి తనకు కాదన్నట్టు బిల్డప్. దీనికోసం ఓ నలుగురితో అనధికారిక బృందం ఏర్పాటు. ఆ నలుగురిలో ఓ ఇద్దరు మహిళలూ ఉండటం గమనార్హం. ఇంకేమి దశాబ్దాలుగా వృత్తిచేసినందుకు గాను వారికొచ్చిన కొద్దిపాటి సొమ్ములో కొంత తేరగా తిందామన్న అత్యాశకు బీజం పడింది. దీనికి వేదిక అయింది వ్యవసాయ యూనివర్సిటీ. ఆ అక్రమ వసూళ్లపర్వంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగా ణ): వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నే తలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రోపణలొచ్చాయి. యూజీసీ ఎరియర్స్ విడుదల కోసం 2శాతం చొప్పున కమీషన్లు ఇచ్చుకోవాలంటూ ఓ కీలక అధికారి ఈ అనధికారి క ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీని కోసం ఏకంగా ఓ కమిటీ వేసినట్టు చర్చ నడుస్తున్నది. ఆ నలుగురు ప్రొఫెసర్లతో ఏర్పాటుచేసిన ఈ కమిటీలో ఇద్దరు మహిళా ప్రొఫెసర్లు కూడా ఉండటం గమనార్హం. ఓ మహిళా ప్రొఫెసర్ జిల్లాల నుంచి వసూళ్ల బాధ్యతను తీసుకొన్నట్టుగా సమాచారం. కేవలం నగదు రూపంలోనే ఇవ్వాలని, ఆన్లైన్ పేమెంట్లకు అవకాశం లేదని తేల్చి చెప్తున్నట్టుగా తెలిసింది.
రూ.35 కోట్ల ఎరియర్స్ విడుదల
యూనివర్సిటీలోని ప్రొఫెసర్లకు, రిటైర్డ్ ప్రొఫెసర్లకు చాలా ఏండ్ల తర్వాత యూజీసీ ఎరియర్స్ కింద రూ.35 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసినట్టు తెలిసింది. వీటిలో రిటైర్డ్ ప్రొఫెసర్లకు కొంత మొత్తాన్ని పంపిణీ చేయగా, మిగిలిన వా రికి ఇచ్చేందుకు ఆడిట్ అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. ఈ సమస్య పరిష్కారం కాదేమోనని.. దీన్ని అడ్డుపెట్టుకొని ఇదే అదునుగా ఎక్కువ మొ త్తంలో వసూలు చేయాలని తొలుత ఆ కీలక అ ధికారి భావించినట్టు తెలిసింది. ప్రొఫెసర్లంతా క లిసి కలిసి చర్యలు తీసుకోవడంతో ఆ సమస్య పరిష్కారానికి మార్గం సుగుమం ఏర్పడింది. ఇందుకుగాను 2శాతం చొప్పున కమీషన్ వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అక్రమ వసూలుకు సన్మానం ముసుగు
ఇటీవల విడుదలైన రూ.35 కోట్ల ఎరియర్స్‌పై వర్సిటీ కీలక అధికారి కన్నుపడినట్టు తెలిసింది. కారణం లేకుండా కమీషన్ వసూలు చేస్తే బద్నాం అవుతామని భావించి వసూలు కు సన్మానం ముసుగు తొడిగినట్టుగా సమాచా రం. ఎరియర్స్ కోసం చాలా ఏండ్లుగా పోరాడుతుండగా, ఎంపీలు చొరవ చూపారని తెలుస్తున్నది. ఇక్కడే ఆ కీలక అధికారి కుట్రతో ఆ సన్మానాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్‌తో పోస్ట్.. బీజేపీతో దోస్తీకి తహతహ
సదరు కీలక అధికారికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోస్టు వచ్చింది. భవిష్యత్తులో తన రాజకీయ అవసరాల కోసం తన రూట్ మార్చినట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తూ వచ్చిన ఆ అధికారి.. ఇప్పుడు బీజేపీతో దోస్తీకి తహతహలాడుతున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంపీలను మచ్చిక చేసుకొనేందుకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టుగా వర్సిటీలో గుసగుసలు కోడై కూస్తున్నాయి.
ఆ ముగ్గురు ఎంపీల సన్మానం పేరిట రహస్య ఎజెండా!
ఎరియర్స్ విడుదలకు ఎంపీలైన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లు రవి ఢిల్లీలో చొరవ చూపినట్టుగా చెప్తున్నారు. వారికి సన్మానం పేరుతో ఆ కీలక అధికారి తన రహస్య ఎజెండాను అమలు చేసి లక్షల సొమ్మును తన జేబులో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు వాళ్లు సన్మానం చేయాలని అడిగారా? ఒకవేళ చేయాల్సి వస్తే ప్రొఫెసర్ల అసోసియేషన్‌కు ఆ బాధ్యతలు అప్పగించి కార్యక్రమం చేయిస్తే అందరి భాగస్వామ్యం ఉంటుందని, కానీ, సొమ్ములు నొక్కేందుకు కొందరినే ఎంపిక చేసుకొన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రొఫెసర్ల సంఘాన్ని పక్కనబెట్టి అనధికారికి కమిటీ వేసి ఈ అడ్డదారి పనులెందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కీలకాధికారి నిర్ణయంపై ప్రొఫెసర్ల సంఘం సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలిసింది. ఎంపీల సన్మానానికి ఇంత భారీ మొత్తం ఖర్చవుతుందా? అనే ప్రశ్నలు, అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

