హైదరాబాద్, జనవరి 3 : మల్టీజోనల్ క్యాడర్లో కేటాయించిన ఉద్యోగులను స్టేట్ యూనిట్‌గా తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌తో టీజీవో నేతలు సమావేశమయ్యారు. భార్యభర్త ఒకేచోట పనిచేసేలా సర్దుబాటు చేయాలని కోరారు. అనంతరం టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నాయకులు జీ వెంకటేశ్వర్లు, టీ లక్ష్మణ్‌గౌడ్, ఎంబీ కృష్ణాయాదవ్, వెంకటయ్య సీఎస్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.