హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హరితహారం అని చెప్పారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు.
Watch: Spiritual leader Sri @SadhguruJV in conversation with IT & Industries Minister @KTRTRS at the Telangana Pavilion @WEF in Davos https://t.co/GRBm80hdF2
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2022
భూసారాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రెండుమూడు దశాబ్దాల్లో వ్యవసాయ భూములు అంతరించిపోయి ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సేవ్ సాయిల్ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమం గురించి వివరించారు. పంట భూములను కాపాడుకొనేందుకు లండన్ నుంచి కావేరి వరకు తాను నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ ర్యాలీలో భాగం కావాలని వివిధ ప్రభుత్వాధినేతలు, ప్రముఖ కంపెనీలను జగ్గీ వాసుదేవ్ కోరారు.