సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 18:41:23

ఎమెల్సీ ఎన్నికల్లో కవిత గెలువాలని ప్రత్యేక పూజలు

ఎమెల్సీ ఎన్నికల్లో కవిత గెలువాలని ప్రత్యేక పూజలు

జగిత్యాల : నిజామాబాద్‌ ఎమెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలువాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ గుగ్గిల్ల హరీశ్‌ ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో 108 కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎమెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సజావుగా జరిగేలా చూడాలని మొక్కులను చెల్లించుకున్నట్లు తెలిపారు. 


logo