హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్లో లోయర్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనం తరం కాళేశ్వరం ఆలయానికి(Muktiswara Swamy Temple) చేరుకున్న కేటీఆర్‌కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకోనున్నారు. పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతారు.