హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫస్టియర్లోని ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. కౌన్సెలింగ్ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఇంజినీరింగ్ సీట్ల భర్తీ పూర్తయ్యింది.
సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. రూ. 400 రుసుముతో 4 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు.
9న స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్, 11న సీట్ల కేటాయింపు, 11 నుంచి 13 వరకు ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ చేపట్టనున్నారు. 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.