హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ స్వచ్ఛ జలాలను అందిస్తు న్న మిషన్ భగీరథలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు వంద రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత నెలలోనే ప్రారంభమైన డ్రై వ్ ఏప్రిల్ వరకు మూడు దశల్లో కొనసాగనున్నది. మొదటి దశలో ఇన్‌టేక్ వెల్స్, పంపుసెట్లు, విద్యుత్తు సమస్యలను పరిశీలించారు. రెండో దశలో పైపులైన్లు, వాల్వ్‌లు, జంక్షన్ల పనితీరును పరిశీలించారు. మూడో దశలో గ్రామాల్లోని పైపులైన్ల లీకేజీలు, కొత్త ఇండ్లకు కనెక్షన్లు, ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు వస్తున్నాయా ?లేదా? వాటిని తాగడానికి ఉపయోగిస్తున్నారా? లేదా? అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఆర్వోఆర్ వాటర్‌ను వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు, నష్టాల గురించి అవగాహన కల్పించనున్నారు. మిష న్ భగీరథ ద్వారా 23,890 గ్రామాల్లోని 54.06 లక్షల ఇండ్లకు నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు.