హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానలో సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఓపీ, ఐపీ, అత్యవసర కౌంటర్లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి శనివారం సింగరేణి డైరెక్టర్ బలరామ్‌నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కొనియాడారు. కౌంటర్ల వల్ల 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి డీసీఎంవో డాక్టర్ బాలకోటయ్య, పీఆ ర్వో శ్రీకాంత్, నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.