హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ స్పెషల్‌క్లాసులు నిర్వహించబోతున్నారు. సాయంత్రం గంటపాటు ఈ క్లాసులుంటాయి. అవి పూర్తిగా ఆన్లైన్ క్లాసులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ క్లాసులు ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇంతకాలం సాయంత్రం 4:30గంటల వరకు నడిచిన కాలేజీలు సాయంత్రం 5:30గంటల వరకు నడుస్తాయి. ఫిజిక్స్‌వాలా, క్లాట్ ఆన్లైన్ క్లాసులను సాయంత్రం పూట ప్రసారం చేస్తారు.
ఇప్పటికే సర్కార్ కాలేజీలకు రెండు చొప్పున ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను అధికారులు సమకూర్చారు. ఇవేకాకుండా 360కి పైగా కాలేజీల్లో డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఆధారంగా స్పెషల్‌క్లాసులు నిర్వహించే యోచనలో అధికారులున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ సమకూర్చాలని ఇప్పటికే నిర్ణయించారు. ఉచిత యూనిఫారాలు సైతం చేర్చారు. ఈ నాలుగింటికి రూ. 400కోట్లు ఖర్చుచేస్తామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం 30 సంఘాలతో తెలంగాణ టీచర్స్ జేఏసీ (టీజీ టీ జేఏసీ) ఏర్పాటైంది. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా ఎస్ చంద్రశేఖర్‌రావు, సెక్రటరీ జనరల్‌గా శానమోని నర్సింహులును ఎన్నుకున్నారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా కిశోర్‌కుమార్, లక్ష్మణ్, దేవేందర్, నజీరుద్దీన్, కృష్ణ, సత్యనారాయణ, మాలోత్ శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు.