బాన్సువాడ టౌన్, ఆగస్టు 27: వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలువనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆదివారం వారు స్పీకర్ను కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
అనంతరం సభాపతి పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు. దేశంలో ప్రజల వద్దకు పాలన అనేది అక్షరాల నిజం చేస్తున్నది ఒక్క తెలంగాణ సర్కారేనని ఆయన స్పష్టం చేశారు.