బాన్సువాడ, సెప్టెంబర్ 14 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కురుమ కులస్థులు మద్దతు ప్రకటించారు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లికి చెందిన కురుమ కుటుంబాల వారు గురువారం సమావేశమై స్పీకర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఆ తీర్మాన పత్రాన్ని బాన్సువాడలో స్పీకర్‌ను కలిసి అందజేశారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొచ్చిందని వారు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న స్పీకర్‌కే తమ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు.