బాన్సువాడ రూరల్/ వర్ని, అక్టోబర్ 7 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కార్కు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మాలాపూర్లో రూ.2.53 కోట్ల అభివృద్ధి పనులను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా వర్నిలోని సీసీడీలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూరు, కో టగిరి, పొతంగల్ మండలాలకు చెందిన 1,434 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మం జూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భం గా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూర దృష్టితో రూ.85 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పా రు. భవిష్యత్లో సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పేదలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందాలనే సంకల్పంతో బాన్సువాడ ని యోజకవర్గంలో దవాఖానలు, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేసినట్టు చెప్పారు.