కోటగిరి, డిసెంబర్ 24: దేశ ప్రధాని అంటే అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలని, కానీ తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టే వాడు నాయకుడు కాదని, కడుపున పెట్టుకొని పరిపాలించే వాడే నాయకుడని పేర్కొన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.