కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన సతీమణి పుష్పమ్మతో కలిసి బోనమెత్తారు.
ఈ సందర్భంగా యువతులతో కలిసి స్పీకర్ ఉత్సాహంగా నృత్యం చేశారు. బోనాలు, జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమని పోచారం పేర్కొన్నారు.
-బాన్సువాడ టౌన్