హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నలుగురు సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బాలునాయక్, కౌసర్ మెయినుద్దీన్, కూనంనేని సాంబశివరావులను ప్యానల్ స్పీకర్లుగా వ్యవహరిస్తారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు.
ప్యానల్ స్పీకర్‌గా ప్రకటించిన బాలునాయక్ శనివారం కొంతసేపు స్పీకర్ స్థానంలో కూర్చుని, సభను నడిపించారు.