నేడు దానం నాగేందర్‌ను విచారించనున్న స్పీకర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార్టీ ఫిరాయించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం విచారించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే పార్టీ ఫిరాయించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ బీ ఫాంపై సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దానం పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పీకర్‌కు రెండేండ్ల క్రితమే ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ చేపట్టారు.పది మంది ఎమెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు రాగా.. 8 మందిపై విచారణను ఇప్పటికే ముగించారు. ఇప్పుడు నాగేందర్, ఎమ్మెల్యే శ్రీహరి ఫిరాయింపు అంశంపై విచారణ జరుపాల్సి ఉన్నది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

