హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుతో స్పీకర్ రంగనాథ్‌ను మందలించారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలిపారు. వెంటనే ప్రొటోకాల్ ఉల్లంఘన లేకుండా చూడాలని ఆదేశించారని చెప్పారు. తాజాగా కూకట్పల్లి నల్లచెరువు సుందరీకరణ తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పేరు రాశారని.. గెలిచిన ఎమ్మెల్యే పేరు, స్థానిక ఎమ్మెల్సీ పేర్లు రాయలేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ శిలాఫలకంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణీదేవి పేర్లు పెట్టకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శిలాఫలకంపై వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేర్లు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్పీకర్ అల్టిమేటం జారీచేశారు. మరోసారి ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘన లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పీకర్ ఆదేశించారని బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు.
నల్ల చెరువు ప్రారంభోత్సవంలో అందరు అధికారులు, మంత్రుల పేర్లు పెట్టినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేర్లు పెట్టకపోవడం వివాదాస్పదమైంది. ఈ అంశంలోనే స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా చూసుకోవాలని కోరారు. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నదని వివరించారు. ఎకడ అధికారిక కార్యక్రమం జరిగినా.. బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. తాజాగా నల్లచెరువు అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా చూసుకోవాలని, శిలాఫలకంపై వారి పేర్లు మళ్లీ చేర్చాలని ఆదేశించారు.