హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఇదేరోజు శాసనమండలి సమావేశాలను చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.
శనివారం ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగాయి. అనంతరం ఉభయసభలు ధన్యవాద తీర్మానానికి ఆమోదం తెలిపాయి. మండలి సమావేశాలు ఒక రోజులో దాదాపు 7 గంటలు జరిగితే, 12 మంది సభ్యులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్నట్టు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు.