శ్రీశైలం : శ్రీశైల మల్లన్న గర్భాలయ స్పర్శదర్శనం ఈ నెల 22 నుంచి నిలిపివేయనున్నట్లు ఈవో లవన్న స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా రద్దీ దృష్ట్యా మంగళవారం నుండి మార్చి 4వ తేదీ వరకు స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
అదే విధంగా ప్రస్తుతం ఇరుముడితో ఉన్న శివస్వాములకు మాత్రమే గర్భాలయ ప్రవేశం, స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల దీక్షలు చేసుకుని క్షేత్రానికి ముడుపులు చెల్లించేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి స్వామిఅమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా యాత్రికులు కూడా దేవస్థానం సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.