ఆదిలాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన రైతు పోశెట్టి 20 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చాడు. పంట నాణ్యత సరిగా లేదంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకు లు తిరస్కరించారు. చేసేదేమీ లేక పంటను మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,328 ఉం డగా.. రూ.3 వేలకు చొప్పున విక్రయించడానికి మార్కెట్ నుంచి వాపస్ తీసుకుపోయా డు. ప్రకృతి కారణంగా పంట నష్టం జరిగితే తామేమి చేయగలమని రైతు పోశెట్టి వాపోయాడు.