Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. హైదరాబాద్-కన్యాకుమారి (07230) రైలు జులై 2 నుంచి 23 వరకు నాలుగు ట్రిప్పులు నడుస్తుందని.. ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రైలు నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి.. శుక్రవారం వేకువ జామున 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని చెప్పింది. ఇక కన్యాకుమారి-హైదరాబాద్ (07229) రైలు జులై 4 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది.
ప్రతిరోజు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు సాయంత్రం 2.30 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని చెప్పింది. ఈ రైలు రెండు మార్గాల్లో సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పడి, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, మయిలదుతురై, కుంభకోణం, తంజావూర్, తిరుచిరాపల్లి, దిండిగుల్, కొడైకెనాల్, మధురై, విరుదునగర్, సాతూర్, కోవిల్పట్టి, తిరునల్వేలి, నాగర్ కోయిల్ స్టేషన్లలో రైలు ఆగుతుందని తెలిపింది. రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయని.. ప్రయాణికులు రైలును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.