Trains Cancelled | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలతో పలుచోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. మరికొన్నిచోట్ల ట్రాక్లు నీటమునిగాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తాజాగా మరో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం, బుధవారాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ (17233), సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ (17234), విశాఖపట్నం – సికింద్రాబాద్ (12783), విశాఖపట్నం-సికింద్రాబాద్ (22203), సికింద్రాబాద్-షాలిమార్ (12774), షాలిమార్ – సికింద్రాబాద్ (12773) రైళ్లు రద్దయ్యాయని పేర్కొంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం (22204), బెంగళూరు – హౌరా (12864), కడప-విశాఖపట్నం (17487), ఆదిలాబాద్-నాందేడ్ (17409), నాందేడ్-ఆదిలాబాద్ (17410), విశాఖపట్నం – సికింద్రాబాద్ (12805), భువనేశ్వర్ – బెంగళూరు (18463), విశాఖపట్నం-గుంటూరు (22701), సికింద్రాబాద్-విశాఖపట్నం (20707), విశాఖపట్నం – సికింద్రాబాద్ (20833), సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) రైళ్లను రద్దు చేసింది. వీటితో పాటు మచిలీపట్నం – తిరుపతి, నర్సాపూర్-నగర్సోల్, బెంగళూరు-దానాపూర్, తిరుపతి-కాకినాడ రైలుతో పాటు మరికొన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బులిటెన్లో పేర్కొంది. అలాగే, మరో 13 రైళ్లు మళ్లించినట్లు వివరించింది. ఈ మేరకు ప్రయాణికులు గమనించి.. సహకరించాలని కోరింది.
Trains 02