Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వివిధ మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను జులై వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చర్లపల్లి-రామేశ్వరం, రామేశ్వరం-చర్లపల్లి, హైదరాబాద్-కొల్లం, కొల్లం-హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు చెప్పింది. చర్లపల్లి-రామేశ్వరం (07695) రైలు జులై 2వ తేదీ నుంచి 23 వరకు పొడిగించినట్లు పేర్కొంది. ఈ రైలు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. రామేశ్వరం -చర్లపల్లి (07696) రైలు ప్రతి శుక్రవారం జులై 4 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని చెప్పింది. హైదరాబాద్-కొల్లం (07193) రైలు జులై 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం.. కొల్లం-హైదరాబాద్ (07194) రైలు జులై 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
చర్లపల్లి-రామేశ్వరం-చర్లపల్లి రైలు రెండు రూట్లలో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పడి, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పులియూర్, చిదంబరం, సిర్కాజి, మైలాదుతురై, తిరువారుర్, తిరుతురైపుండి, మూతుపేట్, అదిరంపట్టినం, పట్టుకొట్టై, కారైకుడి, శివగంగ, మనమదురై, రామనాథపురం స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఇక హైదరాబాద్-కొల్లం-హైదరాబాద్ రైలు నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పడి, జోలర్పేటై, సేలం, ఈ-రోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, మవేలికర, కాయకూలం, కరుణగప్పల్లి, శాస్తంకోట స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది.