Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పింది. చర్లపల్లి-దానాపూర్ (07419) రైలు సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శనివారం రైలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. దానాపూర్-చర్లపల్లి (07420) రైలు సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ ఒకటి వరకు ప్రతి సోమవారం నడుస్తుందని పేర్కొంది.
చర్లపల్లి-బర్హంపూర్ (07027) రైలు సెప్టెంబర్ 5 వరకు నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం, బర్హంపూర్-చర్లపల్లి (07028) రైలు సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 29 వరకు.. ప్రతి శనివారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది. చర్లపల్లి-శాలిమార్ (07225) రైలు సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి సోమవారం.. శాలిమార్-చర్లపల్లి (07226) రైలు సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు ప్రతి మంగళవారం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. సికింద్రాబాద్ – మైసూర్ జంక్షన్ (07033) సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో రైలు రాకపోకలు సాగిస్తుందని.. మైసూర్ జంక్షన్ – సికింద్రాబాద్ (07034) రైలు సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ ఒకటి వరకు ప్రతి మంగళ, సోమవారాల్లో రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.