Sankranti Special Trains | సంక్రాంతికి 32 స్పెషల్ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది.
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా రైళ్లను వినియోగించుకోవాలని సూచించింది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089) మధ్య జనవరి 7, 14 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) జనవరి 8, 15 తేదీల్లో.. వికారాబాద్-బ్రహ్మపూర్ (07091 ) రైలు జనవరి 9, 16 తేదీల్లో నడువనున్నది.
బ్రహ్మాపూర్-సికింద్రాబాద్ (07092) రైలు జనవరి 10, 17 తేదీల్లో.. విశాఖపట్నం నుంచి కర్నూల్ సిటీ (08541) జనవరి 10, 17, 24.. కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) మధ్య జనవరి 11, 18, 25 తేదీల్లో స్పెషల్ రైళ్లు నడుస్తాయని చెప్పింది. శ్రీకాకుళం-వికారాబాద్ (08547) మధ్య జనవరి 12, 19, 26 తేదీల్లో, వికారాబాద్- శ్రీకాకుళం (08548) మధ్య ఈ నెల 13, 20, 27 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్-తిరుపతి (02764) మధ్య ఈ నెల 10, 17 తేదీల్లో.. తిరుపతి -సికింద్రాబాద్ (02763) మధ్య ఈ నెల 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) ఈ నెల 12న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) మధ్య 13న నడువనున్నది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) మధ్య ఈ నెల 8, 15 తేదీల్లో.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) మధ్య 9, 16 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడువనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) మధ్య నెల 10న, సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) మధ్యన జనవరి 11న రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

