రాజ్కోట్: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 50 ఓవర్లలో 325/6 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ప్రిటోరియస్ (123), మూన్సమి (107) శతకాలతో కదం తొక్కారు. ఛేదనలో భారత్ ‘ఏ’.. 49.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయి 73 పరుగుల తేడాతో అపజయం పాలైంది. సిరీస్ 2-1తో భారత్ ‘ఏ’ వశమైంది.