జనగామ : మహిళలు అంటే నాకు అపార గౌరవమని, మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే సభాముఖంగా క్షమించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మహిళలను కోరారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని లింగాల ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో మహిళల పట్ల నోరు జారిన విషయంలో ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణ చెప్పారు.
ఈ మేరకు ఆదివారం స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు మహిళల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. నేను తెలంగాణ యాసలో కేసీఆర్ అన్నీ తానై బాలింతలకు వారి అవ్వా.. అయ్యా, అత్త మామలు ఖర్చు పెట్టక ముందే సీఎం కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకులా అన్ని అవసరాలు తీరుస్తున్నారనే ధోరణిలో మాట్లాడిట్లు తెలిపారు.
అయితే తన మాటలను ఓ పత్రిక వక్రీకరించి రాసిందన్నారు. అయినా కూడా తెలంగాణ ఆడపచుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని ఎమ్మెల్యే రాజయ్య కోరారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ
WhatsApp : భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది : మంత్రి జగదీష్‌రెడ్డి