TGS RTC | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): త్వరలో 300 కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తేవాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని సంకల్పించింది.
ఈ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం లేదని అధికారులు చెప్పారు. సెమీడీలక్స్ సర్వీసులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య నడపనుండగా, నగరంలో మెట్రో డీలక్స్ను తిప్పనున్నారు. ఎక్స్ప్రెస్ బస్సు కంటే వీటిల్లో టికెట్ ధర 5 నుంచి 6 శాతం ఎకువగా, డీలక్స్ కంటే 4 శాతం తకువగా ఉండనున్నది. ఎక్స్ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు ఎకువగా ఉన్నాయి. ఎక్స్ప్రెస్ బస్సుల డిమాండ్ రూట్లలోనే వీటిని తిప్పాలని సంస్థ నిర్ణయించింది.