మహబూబాబాద్ : నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని( Mother) ఆస్తి కోసం(Property) కొడుకులు అనాథను(Sons orphaned mother )చేశారు. విద్యా, బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే చివరి దశలో తల్లికి అండగా ఉండాల్సిన కుమారులు తల్లిని మధ్యలోనే వదిలేశారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్నగర్ (Mahabubnagar )జిల్లాలో చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే..జిల్లాలోని గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, ముగ్గురికి వివాహం చేసింది.
ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాలు భూ మి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో, తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా కొడుకులు పట్టించుకోలేదు. దీంతో బుక్కెడు బువ్వ కోసం ముదిమి వయ సులో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేస్తున్నది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడటం పలువురిని కంటతడి పెట్టించింది.
ఆస్తి కోసం అమ్మను అనాథ చేసిన కొడుకులు
మహబూబాబాద్ – గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా, ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాలు భూమి, బంగారం తీసుకున్నారు.
కాలక్రమంలో ఇల్లు… pic.twitter.com/4GaAX0ZdHM
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2024