హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మాట్ల తిరుపతి అద్భుతంగా ఆలపించిన ఆత్మీయ పాటను దీక్షాదివస్ సందర్భంగా విడుదల చేసినందుకు ఆనందంగా ఉన్నదని, కేసీఆర్ ఉద్యమస్ఫూర్తికి నిదర్శనమని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కొనియాడారు.
‘కేసీఆర్ నిరాహార దీక్ష తెలంగాణ కలల జ్యోతిని వెలిగించి లక్షలాది మంది ఆశలను ఏకం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన మన అపురూపమైన ప్రయాణంలోని భావోద్వేగాల్ని ఈ పాట ప్రతిధ్వనింపజేయాలి’ అని ఈ పాటను ఎక్స్‌లో పోస్టు చేశారు.