హైదరాబాద్ : మెదక్ జిల్లాలో(Medak) విషాదం చోటు చేసుకుంది. అల్లుడి(Son-in-law) మృతి తట్టుకోలేక అత్త మృతి(Aunt died) చెందింది. ఈ విషాదకర సంఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన నర్సింలు(53) అనే వ్యక్తి అనారోగ్యంతో నిన్న కన్నుమూశాడు. నర్సింలు మృతి వార్త తెలిసినప్పటి నుంచి ఆయన అత్త నర్సవ్వ(68) రాత్రంతా రోధిస్తూ గుండెపోటుతో మృతి చెందింది. నర్సింలు, నర్సవ్వ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.