హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకుల టైం టేబుల్‌ను వెంటనే మార్చాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా సొసైటీల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను జేఏసీ భాగస్వామ్య గురుకుల సంఘాల బాధ్యులు సీహెచ్ బాలరాజు, యాదయ్య, రుషికేష్కుమార్, ప్రభుదాస్, కేవీ చలపతి, బాలస్వామి, గోవర్ధన్‌రెడ్డి, ఝాన్సీరాణి, సాంబలక్ష్మి, ఆవుల సైదులు, జానీమియా, శ్రీనివాస్ కలిసి వినతిపత్రాలను అందజేశారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఉమ్మడి టైం టేబుల్‌ను తక్షణమే మార్చాలని, సమస్యలను పరిషరించాలని, లేదంటే 28న చాక్ డౌన్, పెన్ డౌన్ నిర్వహిస్తానని అల్టీమేటం జారీ చేశారు. అప్పటికీ సమస్యలను పరిష్కరించకుంటే నిరవధిక పోరాటాలకు దిగక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అదరగొట్టారు. మంచి వేతన ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. క్యాంపస్ కాలేజీ విద్యార్థినులు చల్లా సాయి మహితారెడ్డి, ఎం అమూల్య రూ.24 లక్షల వేతన ప్యాకేజీతో గోల్డ్‌మెన్ సాక్స్ కంపెనీలో ప్లేస్‌మెంట్స్ సాధించారు. మరో విద్యార్థి కే కుసుమిత జేపీ మెర్గాన్ కంపెనీలో రూ.19.75లక్షలు, నందిని మహారాజ్ వెరిస్క్లో రూ.17లక్షల ప్యాకేజీని కైవసం చేసుకున్నారు. మొత్తంగా 130 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారు. వెల్ప్ఫార్గో 15, హనివెల్ 15, అల్‌స్ట్రోమ్ 33, ఆక్మీ 8, ఎడిగ్లోబ్ 40 మంది విద్యార్థులను ఎంపికచేసుకున్నాయి.