Dharani | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది. ఆయా ఆప్షన్లతో జిల్లాల్లో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు.