సంగారెడ్డి : అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే దుర్భిద్దితో అడ్డదారులు తొక్కాడు. తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. జమ్ముకాశ్మీర్‌కు చెందిన హర్జత్ సింగ్ (35) అనేవ్యక్తి హైదరాబాద్లోసాఫ్ట్వేర్. తొలుతగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వస్తున్న జీతామంతా డ్రగ్స్‌కే ఖర్చువుతుండడంతో తానే డ్రగ్స్ వ్యాపారీగా మారిపోయాడు.
తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, ఇతరులకు డ్రగ్స్‌ను సరపరా చేసే స్థాయికి ఎదిగాడు. డ్రగ్స్ కోసం మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి టాటా కారులో వెళ్లి అక్కడి నుంచి ఎండిఎంఎ క్రిస్టల్స్ డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో సంగారెడ్డి డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి సంగారెడ్డి(Sangareddy)మల్కాపూర్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. హర్జత్ సింగ్ వాహనంలో తనిఖీలు నిర్వహించగా 120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్ డ్రగ్స్ లభించాయి. డ్రగ్స్, వాహనం విలువ రూ. 21.06 లక్షలు ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.