శేరిలింగంపల్లి, జూలై 31: సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌పై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ అంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన దంతలూరి సిద్ధార్థవర్మ (30) కొన్నాళ్లుగా హైదరాబాద్ కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. చలనచిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
అనంతపురానికి చెందిన ఓ యువతి పుప్పాల్‌గూడలో నివసిస్తూ సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. ఆమె స్నేహితురాలి ద్వారా సిద్ధార్థవర్మ పరిచయమయ్యాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి కొండాపూర్‌లోని ఇంటికి పిలిపించుకొని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అవకాశం కల్పించకపోవడం తో మంగళవారం సదరు యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్ధార్థవర్మను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.